ఐఏఎస్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : ఖాజా షరీఫ్

ఐఏఎస్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : ఖాజా షరీఫ్

జనగామ అర్బన్, వెలుగు: టెక్నికల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ శ్రీదేవసేనపై ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాలు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావని, ఆ వ్యాఖ్యలను టీఎన్టీవో సంఘం తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్​ అన్నారు. 

శనివారం కలెక్టరేట్​లోని టీఎన్జీవో భవన్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ ఓ ఐఏఎస్​ ఆఫీసర్​పై గర్నమెంట్​కు సపోర్ట్​గా మాట్లాడుతున్నారంటూ అసంబద్ధమైన వ్యాఖ్యలను చేయడం సరికాదని, వెంటనే అలాంటి పదాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పెండెల శ్రీనివాస్, పేర్వారం ప్రభాకర్, రాజా నర్సయ్య, ఎండీ ఆసిఫ్, సంపత్​కుమార్, ఉప్పలయ్య, నాగార్జున్​, విష్ణు, అరుణ తదితరులు పాల్గొన్నారు.