
- పాల్గొన్న ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, జిల్లా ఆఫీసర్లు,
సూర్యాపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. మన ప్రాంతానికి చెందిన వారికే ఉద్యోగాలు వస్తే ప్రాంతంతో పాటు, దేశం అభివృద్ధి చెందుతుందని భావించి ఉద్యోగాల కోసం ప్రజల తరుపున ఎంతగానో పోరాడారని, వారిని స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఉద్యోగి బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేయాలని జిల్లాలో అభివృద్ధి పనులు,విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ శాఖల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొనిరావాలని అన్నారు.
ఉద్యోగులు అర్హత ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టి భాద్యతగా భావించి కృషి చేయాలని, వెనుకబడిన వారిని అభివృద్ధి చేసి సమాజంలో స్థిర మార్పు తీసుకొచ్చేందుకు ఉద్యోగులందరూ ఒక బృందంగా ఏర్పడి సూర్యాపేట జిల్లాని రాష్ట్రంతో పాటు, దేశంలోనే ముందంజలో ఉంచాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, డీటీడీఓ శంకర్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయి గౌడ్, సంతోష్ కిరణ్, శ్రీలత రెడ్డి అధికారులు
సిబ్బంది పాల్గొన్నారు.
జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడు
యాదాద్రి, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొనియాడారు. బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 91 వ జయంతి పురస్కరించుకుని ఆయన ఫొటోకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ అన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అన్నారు. ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, ఏవోజగన్మోహన్ ప్రసాద్ ,బీసీ సంక్షేమ అధికారి సాహితి , యస్. సి కార్పొరేషన్ ఈ డి శ్యామ్ సుందర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.