అడవిలో తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు

అడవిలో తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు

లింగాల, వెలుగు: పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన జంపన్న, వెంకటస్వామి అనే ఇద్దరు గురువారం నల్లమల అడవిలో పసరు మందుల కోసం వెళ్లారు.సాయంత్రానికి చీకట్లో దారి తప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్  గౌడ్ బాధితులకు ధైర్యం చెప్పి అడవిలోనే ఉండమని సూచించారు. రాత్రి 12 గంటల సమయంలో పోలీసులతో పాటు స్థానిక యువకులతో అడవిలోకి వెళ్లారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా బల్మూర్ మండలంలోని అంబగిరి అడవిలో బాధితులను గుర్తించారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో 20 మీటర్ల దూరంలో చిక్కుకున్న వారిని తాడు సహాయంతో కాపాడారు.వేగంగా స్పందించి ప్రాణాలు రక్షించిన ఎస్సై వెంకటేశ్ గౌడ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.