U19 World Cup 2024 Final: మందకొడిగా భారత్ బ్యాటింగ్.. తొలి 10 ఓవర్లలో 28 పరుగులు

U19 World Cup 2024 Final: మందకొడిగా భారత్ బ్యాటింగ్.. తొలి 10 ఓవర్లలో 28 పరుగులు

254 పరుగుల భారీ ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ మందకొడిగా సాగుతోంది. 3 పరుగులకే ఆర్షిన్ కులకర్ణి(3) వెనుదిరగ్గా.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు బ్యాట్ ఝుళిపించలేకపోతున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్వేచ్ఛగా పరుగులు చేయలేకపోతున్నారు. పవర్ ప్లే ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ముషీర్ ఖాన్(13; 27 బంతుల్లో ఒక ఫోర్), ఆదర్శ్ సింగ్(10; 28 బంతుల్లో ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు హర్జాస్ సింగ్(55), వీబ్‌జెన్(48), డిక్సన్(42), ఆలివర్ పీక్(41) పరుగులు చేయడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత బౌలర్లలో లింబానీ 3 వికెట్లు పడగొట్టగా.. నామన్ తివారీ 2, సామీ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.