ఓటీటీలోకి వచ్చే కొన్ని కొత్త సినిమాల గురించి చాలామంది ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఒకవేళ తెలిసినా.. అవి తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయన్న విషయం మరికొందరికి తెలియకపోవచ్చు. అయితే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న ప్రేక్షకులు మాత్రం భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల చిత్రాలను చూసేస్తుంటారు. కానీ సాధారణ ఆడియన్స్ మాత్రం తమకు నచ్చిన హీరోలు, తెలిసిన జానర్లు ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
అయితే, ఇలాంటి సమయంలో ఇప్పుడు ఓ రెండు డిఫరెంట్ జానర్లకు చెందిన వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఒకటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటే.. మరొకటి ఎమోషనల్ డ్రామాతో మెప్పిస్తోంది. మరి ఆ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దాం.
ఉందేఖి: ది ఫైనల్ బ్యాటిల్-సీజన్ 4:
బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఉండేఖి ఇప్పుడు తన నాలుగో మరియు చివరి సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 1, 2026 నుంచి SonyLIV లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దర్శకుడు ఆశిష్ ఆర్. శుక్లా తెరకెక్కించిన ఈ సీజన్‌లో హర్ష్ ఛాయా, సూర్య శర్మ, వరుణ్ బడోలా, అంకుర్ రాథీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
From the same side to opposite ends, Rinku vs Papaji is here 🔥
— Sony LIV (@SonyLIV) May 3, 2026
Watch Undekhi - The Final Battle, New Season, Streaming Now, only on Sony LIV.#UndekhiSeason4 #UndekhiTheFinalBattle #UndekhiTheFinalBattleOnSonyLIV #PapajiVsRinku pic.twitter.com/hi2WJKiKED
కథేంటంటే:
ఉండేఖి సీజన్–3 తర్వాత ఐదేండ్లు విరామం తీసుకుని నాలుగో సీజన్ కథ మొదలవుతుంది. సురీందర్ సింగ్ అత్వాల్ అలియాస్ పాపాజీ(హర్ష్ ఛాయా) జైలు నుంచి విడుదలవుతాడు. మరోవైపు రింకు (సూర్య శర్మ) తన భార్య, పుట్టబోయే బిడ్డ చావుకు కారణమైన పాపాజీని చంపి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు.
అదే టైంలో మహీందర్ సింగ్ అత్వాల్ అలియాస్ మాహి (వరుణ్ బడోలా) మనాలిలో తన బలాన్ని పెంచుకుంటాడు. వ్యాపారాలను విస్తరిస్తాడు. దాంతోపాటు శత్రువులను కూడా సంపాదించుకుంటాడు. రింకు తన తండ్రి మహీందర్ అని తెలుసుకున్నాక అత్వాల్ సామ్రాజ్యాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. పాపాజీ మాత్రం రింకు నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి అనుకుంటాడు. చివరకు రింకు పాపాజీని ఏం చేస్తాడు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే:
ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే టెన్షన్ మరియు సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రింకు పాత్రలో సూర్య శర్మ నటన సిరీస్‌కు పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. పాపాజీ పాత్రలో హర్ష్ ఛాయా మరోసారి తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించాడు. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా, పవర్ గేమ్స్, రివెంజ్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా బ్యాలెన్స్ చేశారు. అయితే కొన్ని ఎపిసోడ్లు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలిగించినా.. క్లైమాక్స్‌కు దగ్గరయ్యే కొద్దీ కథ మళ్లీ పుంజుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సిరీస్ మూడ్‌కు బాగా సెట్ అయ్యాయి.
ఫైనల్‌గా:
క్రైమ్ థ్రిల్లర్, రివెంజ్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఉండేఖి: ది ఫైనల్ బ్యాటిల్ మంచి బింజ్ వాచ్ (ఒకే సిట్టింగ్‌లో మొత్తం ఎపిసోడ్‌లను పూర్తి చేయడం) అనిపిస్తుంది. గత సీజన్లు చూసినవారికి ఈ ఫైనల్ సీజన్ మరింత కనెక్ట్ అవుతుంది. ట్విస్టులు, ఇంటెన్స్ డ్రామాతో సిరీస్ చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది.
సప్నే వర్సెస్ ఎవ్రీవన్- సీజన్ 2:
డ్రీమ్స్, స్ట్రగుల్స్, రియాలిటీని బలంగా చూపించే వెబ్ సిరీస్‌లలో సప్నే వర్సెస్ ఎవ్రీవన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు సీజన్ 2తో మరింత ఇంటెన్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 1, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌ను అంబరీష్ వర్మ తెరకెక్కించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. పరమ్‌వీర్ సింగ్ చీమా, ఖుషాలీ కుమార్, విజయంత్ కోహ్లీ కీలక పాత్రలు పోషించారు.
sapne dekhna aur sach karna🤍#SapneVsEveryoneOnPrime, New Season, Watch Now pic.twitter.com/5NhdzpZpUV
— prime video IN (@PrimeVideoIN) May 2, 2026
కథేంటంటే:
జిమ్మీ మెహతా (అంబ్రిష్ వర్మ) రియల్ ఎస్టేట్ రంగంలో తనను తాను ‘సేల్స్ గాడ్’ అని చెప్పుకుంటాడు. విజయం సాధించడానికి న్యాయాన్యాయాల గురించి ఆలోచించకుండా ఏ మార్గమైనా సరే ఎంచుకోవాలి అని నమ్మే యువకుడు. తన మామ కుక్రేజా(విజయంత్ కోహ్లీ)పై ప్రతీకారం తీర్చుకోవాలి అని రగిలిపోతుంటాడు. అందుకోసం దేనికైనా సిద్ధపడతాడు. తన మామ ఇంటికి ఎదురుగా ఒక బిల్డింగ్ కట్టించి, అతన్ని రెచ్చగొట్టడానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాడు.
అతని రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు అతని ఫ్రెండ్ ప్రశాంత్ నరులా (పరమ్‌వీర్ సింగ్ చీమా) ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతో ఢిల్లీ నుంచి ముంబైకి వస్తాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కాస్టింగ్ ఏజెంట్‌గా పనిచేస్తూనే తన కోసం అవకాశాలను వెతుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రశాంత్ తన సినిమా కలను నెరవేర్చుకున్నాడా? జిమ్మీ తన మామపై గెలుస్తాడా? తెలియాలంటే ఈ సిరీస్ చూడాలి.
ఎలా ఉందంటే:
సీజన్ 2 మొదటి సీజన్ కంటే మరింత ఎమోషనల్ మరియు రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్తవాళ్లు ఎదుర్కొనే సమస్యలను చాలా సహజంగా చూపించారు. పరమ్‌వీర్ సింగ్ చీమా నటన ఈ సీజన్‌కు ప్రధాన బలం. అలాగే అంబ్రిష్ వర్మ తన పాత్రలో ఎనర్జీ, ఇంటెన్సిటీతో ఆకట్టుకున్నాడు.
సిరీస్‌లో వచ్చే డైలాగ్స్, పాత్రల ఎమోషన్స్ చాలా చోట్ల కనెక్ట్ అవుతాయి. రియల్ ఎస్టేట్, సినిమా రంగాల్లో ఉన్న ఒత్తిళ్లు, మోసాలు, ఆశలు కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. అయితే కొన్ని ఎపిసోడ్లు కాస్త స్లోగా అనిపించినా.. పాత్రల ప్రయాణం మాత్రం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది.
ఫైనల్‌గా:
రియలిస్టిక్ డ్రామాలు, స్ట్రగుల్ స్టోరీలు ఇష్టపడే వారికిసప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2 మంచి ఛాయిస్. కలల కోసం పోరాడే యువత జీవితాన్ని ఎమోషనల్‌గా చూపించిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
