బూస్టర్ డోసులకు డిమాండ్ పెరిగితే ఆ దేశాలపై ఎఫెక్ట్

బూస్టర్ డోసులకు డిమాండ్ పెరిగితే ఆ దేశాలపై ఎఫెక్ట్

న్యూఢిల్లీ: వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. దీంతో బూస్టర్ డోసులకు డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ డిమాండ్ ఇంకా పెరిగితే పేద దేశాలకు వ్యాక్సినేషన్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ అన్నారు. పేద దేశాలు, రిచ్ కంట్రీస్ కు మధ్య వ్యాక్సినేషన్ లో తీవ్ర వ్యత్యాసం ఉందని.. ఇది ప్రపంచానికి మంచిది కాదన్నారు. పేద దేశాలకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని.. దీనికి ధనిక దేశాలు సహకరించాలని ఓ నేషనల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీత చెప్పారు. బూస్టర్ డోసులకు డిమాండ్ పెరిగితే పేద దేశాలకు టీకాల పంపిణీపై ఎఫెక్ట్ చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమన్నారు. అయితే దీని వల్ల తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చునని.. కానీ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంటుందన్నారు. 

‘వ్యాక్సిన్ల విషయంలో అసమానతలు ఉండటం విషాదకరం. ఈ ఏడాది ఆఖరుకు ధనిక దేశాల్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. కానీ అప్పటికి పేద దేశాల్లో మాత్రం 4 శాతం ప్రజలకు కూడా టీకా అందదు. ఈ సంవత్సరం చివరకు ప్రతి దేశంలోనూ 40 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఆ టైమ్ కు 80 దేశాలు నిర్దేశిత టార్గెట్ ను చేరుకోలేవు. కావాల్సినంత టీకా డోసులు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. 1.5 బిలియన్ల టీకా డోసులు ఇస్తామని ధనిక దేశాలు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటికి కేవలం 300 మిలియన్ల డోసులు మాత్రమే పేద దేశాలకు సరఫరా చేశాయి. ఒమిక్రాన్ భయంతో బూస్టర్ డోసులకు డిమాండ్ పెరుగుతోంది. దీని వల్ల తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు అయ్యే టీకా డోసుల సరఫరాకు తీవ్ర ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది’ అని గీతా గోపీనాథ్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

సర్పంచ్ పోస్టు @రూ.44 లక్షలు

కేసీఆర్ సర్కారుకు పాడె కట్టేది రైతులే

అమ్మాయిల వివాహ వయస్సు పెంపు.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్