కేసీఆర్ సర్కారుకు పాడె కట్టేది రైతులే

కేసీఆర్ సర్కారుకు పాడె కట్టేది రైతులే

హైదరాబాద్: బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులేక, పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే రైతు చావులను సర్కస్ లా చూస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ను నమ్మలేక, పురుగుల మందునే నమ్ముకొని అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ట్వీట్ చేశారు. 

వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు.. ఈ పాపం తనదు కాదని కేసీఆర్ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. వందలాది మంది రైతుల చావులకు కారణమైన కేసీఆర్ పాపం ఊరికే పోదని దుయ్యబట్టారు. ‘మీరు రైతు హంతకులు. అన్నదాతలను కాటికి పంపుతున్న మీ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది, మీ అధికారానికి పాతరేసేది రైతులే’ అని ట్వీట్ లో షర్మిల విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం: 

అమ్మాయిల వివాహ వయస్సు పెంపు.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్?

ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయను

మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువుల షట్టర్ కూల్చివేత