సీతారాముల కల్యాణం..ఈ పాటలు ఎంతో ప్రత్యేకం

 సీతారాముల కల్యాణం..ఈ పాటలు ఎంతో ప్రత్యేకం

మన  సనాతన ధర్మంలో  పెళ్లంటే ఏడడుగులు,  ఏడు జన్మల బంధం.  హైందవ ధర్మంలో పెళ్లి అనే మాట ఉంది.  కానీ,  ఆ పదానికి వ్యతిరేక పదం అసలు పుట్టనే లేదు.  విడాకులు అని ఒక పదం పుట్టుకొచ్చినా  అది  ధార్మిక  పదం కాదు.  ఎందుకంటే మన పూర్వీకులు పెళ్లి తరువాత ‘వివాహ విచ్ఛేదనం’ అనే విషయం గురించి ఆలోచించనేలేదు.  అలాంటి  విచ్ఛేదనానికి రూల్స్ పెట్టనేలేదు.   హిందువులకి  సీతారాములు ఆదర్శ దంపతులు. తెలుగువారి  వివాహ వేడుకల్లో  సీతారాముల కల్యాణానికి  సంబంధించిన  పాటలు ఎంతో ప్రత్యేకం.  ముఖ్యంగా  ‘సీతాకల్యాణ వైభోగమే’ (త్యాగయ్య కీర్తన),  ‘సీతారాముల కల్యాణం చూతము  రారండి’ (సీతారామ కల్యాణం - 1961) వంటి పాటలు వివాహాల్లో తప్పనిసరిగా వినబడతాయి. ఇవి భక్తిని, ఆనందాన్ని  పంచుతాయి.  సీతారాముల  కల్యాణం అంటేనే  ఏడడుగులు, ఏడు జన్మల బంధం.. ఇంకా చెప్పాలంటే అది  జన్మ జన్మల బంధం.

సీతారాముల కల్యాణం చూతము రారండి..

 సీతారాముల వివాహానికి సంబంధించిన కొన్ని  ప్రసిద్ధ పాటలు/కీర్తనలు నేటికీ ఎంతో ఆదరణ పొందుతున్నాయి.  సీతాకల్యాణ వైభోగమే (త్యాగరాజ కీర్తన).  ఇది పెళ్లి తలంబ్రాల సమయంలో అత్యంత ఎక్కువగా వినిపించే కీర్తన.  సీతారాముల కళ్యాణం చూతము రారండి ( సీతారామ కల్యాణం, 1961) సముద్రాల సాహిత్యం అందించిన ఈ పాట తెలుగు వివాహ వేడుకలకే కాక శ్రీరామనవమికి కూడా ప్రసిద్ధి.  జానకి దోసిట కెంపుల ప్రోవై (సీతారామ కల్యాణం 1961) తలంబ్రాల సన్నివేశాన్ని వర్ణించే పాట.  సీతారాముల కల్యాణం చూద్దాం రారండి (భక్తిగీతం) పెళ్లి పాటలకు  ఇది  ఒక  ప్రత్యేక శైలిని  సమకూర్చింది.   శ్రీరాముడు,  సీతాదేవి  వివాహ  మహోత్సవాన్ని ఎంతో అద్భుతంగా,  పవిత్రంగా  ఈ పాటలు వర్ణిస్తాయి.   సీతారాముల కల్యాణం  నిత్య నూతనంగా,  జానకి  రామునితో  జతకట్టడాన్ని,  తలంబ్రాల వేడుకను  ఈ  పాటలు  కళ్లకు  కట్టినట్లు చూపుతాయి.   పెళ్లి జరిగిన కొంతకాలానికే  వివాహ బంధం విచ్ఛినం అవుతున్న నేటికాలంలో  మన సమాజం  సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 

పి. నరహరి 
ఐఏఎస్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.