IND vs NZ: కోహ్లీ హాఫ్ సెంచరీ.. 400 పరుగుల దిశగా భారత్

IND vs NZ: కోహ్లీ హాఫ్ సెంచరీ.. 400 పరుగుల దిశగా భారత్

వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  సూపర్ ఫామ్ కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సెమీ ఫైనల్లో అర్ధ సెంచరీతో మెరిశాడు. కోహ్లీకి ఈ టోర్నీలో ఇది ఆరో హాఫ్ సెంచరీ కాగా ఓవరాల్ గా 72 వది. రోహిత్ అవుట్ అవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ భారీ షాట్స్ కి వెళ్లకుండా 4 ఫోర్లతో 59 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

also read :- IND vs NZ: మరో వరల్డ్ రికార్డు బ్రేక్.. సచిన్‌ను దాటేసిన కోహ్లీ

కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడు గిల్ 79 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. రోహిత్ శర్మ 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం భారత్ 27 ఓవర్లో వికెట్ నష్టానికి 194 పరుగులు చేసింది. కోహ్లీ (50) శ్రేయాస్ అయ్యర్ క్రీజ్ లో ఉన్నారు. గిల్ 79 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు వెళ్ళాడు. రోహిత్ వెనుదిరిగినా.. అక్కడినుండి ఆ భాద్యతను గిల్ కొనసాగించాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.