
ఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన విస్తారా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కావడవంతో తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారని..వారంతా సురక్షితమని డీజీసీఏ ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.
2022లో ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ ను టాటా గ్రూప్ విలీనం చేసింది. విస్తారాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు కూడా వాటా ఉంది. ఎయిర్ ఇండియాలోనూ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా కేటాయిస్తారు.
మరోవైపు సోమవారం మరో ఘటనలో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన గో ఫస్ట్ విమానం ప్రయాణికులు ఎక్కకుండానే టేకాఫ్ అయింది. 50 మందికి పైగా ప్యాసింజర్లు బోర్డింగ్ కాకుండానే బయలుదేరి వెళ్లింది. అయితే ఆ ప్రయాణికులు మాత్రమ షటిల్ బస్సులో బోర్డింగ్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు.