వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

జహీరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శనివారం జహీరాబాద్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జహీరాబాద్‌లో జరిగే ప్రైవేటు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు వచ్చిన ఆయనకు అతిథి హోటల్ వద్ద రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంచందర్ రాజనర్సింహ, నియోజకవర్గ ఇన్‌చార్జి జనార్దన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జగన్నాథ్, నేతలు శ్రీనివాస్ గౌడ్, సుధీర్ కుమార్, నరేశ్ పటేల్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం టీచర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని తపస్ నాయకులు దత్తాత్రి, అడివన్న వివేక్‌కు వినతి పత్రం అందజేశారు.