ప్రిపెయిడ్ చార్జీలు పెంచిన వోడా ఫోన్

ప్రిపెయిడ్ చార్జీలు పెంచిన వోడా ఫోన్
  • ధరల పెంపు సేవలను మెరుగుపరుస్తుంది

న్యూఢిల్లీ: మొబైల్ కంపెనీలు చార్జీల పెంపు బాటలో వెళుతున్నాయి. నిన్న ఎయిర్ టెల్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇవాళ వోడా ఫోన్ ఐడియా వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త మొబైల్ టారిఫ్‌లు ఎల్లుండి నుంచి అంటే నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయి. ధరల పెంపు సేవలను మెరుగుపరుస్తుందని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.

ఆర్ధిక ఒత్తిళ్ల నుంచి టెలికాం పరిశ్రమకు కాస్త ఉపశమనం కలుగుతుందని,  ధరల పెంపు సేవలను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది.  ప్రి పెయిడ్‌ చార్జీలను 20 శాతం నుంచి 25 శాతం మేర పెంచుతున్నట్లు వొడాఫోన్‌ ఐడిఆయా వెల్లడించింది. పెంచిన చార్జీలు దాదాపు ఎయిర్‌టెల్‌ కంటే తక్కువే ఉన్నాయని పేర్కొంది.  ప్రస్తుతం రూ. 79ల రీచార్జి ప్లాన్ రూ. 99లు అయిందని వొడాఫోన్‌ పెంచింది. ఇతర చార్జీలకు దిగువ ఇచ్చిన చార్ట్‌ చూడండి..