
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్అర్బన్బ్యాంక్ను రాష్ర్టంలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని వరంగల్అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ఎర్రబెల్లి ప్రదీప్రావు అన్నారు. శుక్రవారం కాశీబుగ్గలోని బ్యాంక్ హెడ్ ఆఫీస్లో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ వరంగల్ అర్బన్బ్యాంక్ 1995లో రూ.5 కోట్లతో ప్రారంభమై ప్రస్తుతం రూ.400 కోట్ల టర్నోవర్తో ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటి వరకు 10శాఖలను ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా కొత్త కమిటీ పనిచేస్తుందన్నారు.
చైర్మన్గా ఎర్రబెల్లి ప్రదీప్రావు, వైస్ చైర్మన్గా తోట జగన్నాథం, డైరెక్టర్లు నీలం మల్లేశం, మందా స్వప్న, బానోతు సీతామహాలక్ష్మి, చకిలం ఉపేందర్, కూరపాటి చంద్రమౌలి, అయినవోలు వెంకట సత్య మోహన్, వడ్నాల సదానందం, వేణుగోపాల్ ముందాడా, పత్తి కృష్ణ, మహమ్మద్ సర్వర్ అహ్మద్ పాషా ప్రమాణాస్వీకారం చేశారు.