వెపన్‌‌.. సూపర్ హ్యూమన్‌‌

వెపన్‌‌.. సూపర్ హ్యూమన్‌‌

సత్యరాజ్, వసంత్ రవి లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో మిలియన్ స్టూడియో సంస్థ నిర్మించింది. ఈ మూవీ టీజర్‌‌‌‌ను ఇటీవల విడుదల చేశారు.  ఇంటరెస్టింగ్ విజువల్స్‌‌తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్‌‌ టీజర్‌‌‌‌లో సత్యరాజ్, వసంత్ రవిలపై తీసిన సీన్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. సూపర్ హ్యూమన్‌‌ ఎవరనే అన్వేషణ జరుగుతుంటుంది. 

అది సత్యారాజా లేక వసంత్ రవినా అనేది సస్పెన్స్. దీంతో ఈ ఇద్దరి పాత్రలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. రాజీవ్ మీనన్, తాన్యా హోప్, యషికా ఆనంద్, మైమ్ గోపి, కణిత ఇతర పాత్రలు పోషిస్తున్నారు.