దోషులను ఉరి తీయాల్సిందే .. కోల్​కతాలో భారీ ర్యాలీ

దోషులను ఉరి తీయాల్సిందే .. కోల్​కతాలో భారీ ర్యాలీ
  • ఆదివారం వరకు సీబీఐకి సీఎం మమత డెడ్​లైన్
  • కోల్​కతాలో భారీ ర్యాలీ

కోల్​కతా: హత్యాచార ఘటన నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్​కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలీలో ప్రారంభమైన ర్యాలీ డొరినా క్రాసింగ్ వరకు కొనసాగింది. ర్యాలీలో టీఎంసీ మహిళా ఎంపీలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు. ‘‘ట్రెయినీ డాక్టర్​ను దారుణంగా రేప్ చేసి చంపేసిన నిందితులను ఉరి తీయాలి. దేశ ప్రజలందరూ మృతురాలి కుటుంబానికి అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. 

హాస్పిటల్​పై దాడి ఘటనలో బీజేపీ, సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నరు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది నేనే. క్రైమ్ సీన్​ను ధ్వంసం చేయాలని చూసింది బీజేపీ, సీపీఎం నేతలే. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఆదివారంలోగా దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె సీబీఐఈకి అల్టిమేటం ఇచ్చారు. కాగా, ట్రెయినీడాక్టర్​పై హత్యాచారం ఘటనను మమతా బెనర్జీనే రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. తమ వాళ్లను కాపాడుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

నేడు డాక్టర్ల దేశవ్యాప్త నిరసన

కోల్​కతా డాక్టర్ హత్యాచారం ఘటనకు నిరసనగా శనివారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు ఇచ్చింది. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని సేవలు ఆపేయాలని సూచించింది. ప్రతి రోజూ డాక్టర్లు హింసకు గురవుతున్నారని తెలిపింది. మహిళ డాక్టర్లు, సిబ్బందికి భద్రత కరువైందని, అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఐఎంఏ గుర్తుచేసింది. ‘‘సంస్థ అధికార పరిధి భారత రాజ్యాంగం ద్వారా నిర్వచించారు. అది శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ ఏదైనా కావచ్చు.

 కోర్టుల అధికార పరిధి సైతం నిర్ణయించబడింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికాలోని సుప్రీంకోర్టు, యూకేలో అత్యున్నత న్యాయస్థానం, ఒక్కసారి అయినా రాజ్యాంగంలో పొందిపర్చిన నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు” అని ధన్‌‌‌‌ఖడ్ పేర్కొన్నారు. ఇతర దేశాల కోర్టుల పనితీరును పరిశీలించాలని స్టూడెంట్లకు సూచించారు. ఇటీవల హిండెన్​బర్గ్ వెల్లడించిన నివేదికపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.