ప్రియాంక గాంధీ ఇంట్లో పెళ్లి సందడి: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న రైహాన్.. ఎవరు ఈ అవివా బేగ్ !

ప్రియాంక గాంధీ ఇంట్లో పెళ్లి సందడి: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న రైహాన్.. ఎవరు ఈ అవివా బేగ్ !

గాంధీ-వాద్రా కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం  కాంగ్రెస్ నాయకురాలైన ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడైన రైహాన్ వాద్రా తన స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. రైహాన్ స్నేహితురాలైన అవివా బేగ్‌ చాల కాలంగా ఒకరికి ఒకరు బాగా తెలుసు, వీరిని రెండు కుటుంబాలు ఆశీర్వాదించాయి కూడా. కుటుంబ సభ్యులు ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, వీరి  నిశ్చితార్థం చాలా అత్యంత సన్నిహితుల మధ్య  అంతంత మాత్రంగానే జరిగిందని తెలుస్తుంది. 

 అవివా బేగ్ ఎవరు?
 సమాచారం ప్రకారం.. అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ఒక ఫోటోగ్రాఫర్. ఆమె కళ్లముందు కనిపించే సాధారణ విషయాలను కూడా చాలా గొప్పగా కెమెరాతో  తీయడంలో  ఫేమస్. ఆమె ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదివి, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. 

గత కొన్ని సంవత్సరాలుగా ఆమె తీసిన ఫోటోలు చాల పెద్ద పెద్ద షోలలో చోటు సంపాదించుకున్నాయి. వాటిలో 'యు కాంట్ మిస్ దిస్' విత్ మెథడ్ గ్యాలరీ (2023), ఇండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రామ్ (2023), ది కోరమ్ క్లబ్ - ది ఇల్యూసరీ వరల్డ్ (2019), ఇండియా డిజైన్ ఐడి (2018) ఉన్నాయి. ఆమె 'అటెలియర్ 11' అనే స్టూడియోను కూడా నడుపుతుంది. ఈ స్టూడియో వివిధ బ్రాండ్లకు ఫోటోగ్రఫీ సేవలను అందిస్తుంది.
 
రైహాన్ వాద్రా గురించి 
ప్రియాంక గాంధీ కుమారుడైన  రైహాన్ వాద్రా ఒక విజువల్ ఆర్టిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్ కూడా. వివరాల ప్రకారం, అతను డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదివాడు..  ఒకప్పుడు అతని తాత రాజీవ్ గాంధీ, మామ రాహుల్ గాంధీ ఇక్కడే చదువుకున్నారు. తరువాత అతను లండన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)లో రాజకీయ శాస్త్రం అభ్యసించాడు.

 పదేళ్ల వయసు నుంచే ఆయన కెమెరా పట్టుకోవడం మొదలుపెట్టారు.  వైల్డ్‌లైఫ్, స్ట్రీట్ లైఫ్, కమర్షియల్ ఫోటోగ్రఫీలో ఆయనకు మంచి పట్టు ఉంది. వార్తల ప్రకారం, రైహాన్ ఇంకా అవివా గత ఏడేళ్లుగా ఒకరికి ఒకరు బాగా తెలుసు. వీరి రెండు కుటుంబాల అంగీకారంతో వీరి నిశ్చితార్థం చాలా సింపుల్‌గా, కుటుంబ సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.