ఏప్రిల్ ‘ఫూల్స్ డే’ ఎందుకంత ప్రత్యేకత! అది ఎక్కడ మొదలయింది?

ఏప్రిల్ ‘ఫూల్స్ డే’ ఎందుకంత ప్రత్యేకత! అది ఎక్కడ మొదలయింది?

ఏప్రిల్ 1 వస్తుందంటే చాలు.. ఫ్రెండ్స్, కొలీగ్స్ ను ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు చాలామంది. ఒకరిపై మరొకరు ప్రాంక్స్ చేస్తూ ఆ రోజును సరదాగా ఆస్వాధిస్తుంటారు. చరిత్రలో ఏప్రిల్ ఫూల్ డే గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.అయితే, సంవత్సరంలో ఇన్ని రోజులున్నా.. ఏప్రిల్ 1నే ఫూల్స్ డేగా ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజుకు ఎందుకింత ప్రత్యేకతో తెలుసుకుందాం. 

వందేళ్ల చరిత్ర ఉంది: 

ఏప్రిల్ 1న చాలామంది మనల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చిన్న సాకుల చెప్తూ ఫూల్స్ చేస్తుంటారు. చిన్న సాకులను  నమ్మిన వ్యక్తిన ఏప్రిల్ ఫూల్ అంటూ ఎగతాలి చేస్తారు. అయితే, ఈ ఫూల్ డేకు వందేళ్ల చరిత్ర ఉంది. దీనిని మొదటి సారి 1686లో యూనెటెడ్ కింగ్డమ్ లోని జాన్ ఆబెరీ ప్రారంభించాడు. ఆయన.. 1686, ఏప్రిల్ 1న ‘లండన్ క్లాక్ టవర్ దగ్గర సింహం చనిపోయి ఉంద’ని కొన్ని పుకార్లు చేశాడు.

అది నమ్మిన జనాలు సింహాన్ని చూడటానికి క్లాక్ టవర్ దగ్గరకు క్యూ కట్టారు. అక్కడికి వెళ్లి చూసినవాళ్లంతా అవాక్కయ్యారు. సింహం లేదనే నిజాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత రోజు అసలు కథ బయటికి వచ్చింది. జాన్ ఆబెరీనే పుకారు లేపాడని, అందరినీ ఫూల్ చేశాడని వార్తా పత్రికల్లో న్యూస్ వచ్చింది. నిజం అని నమ్మిన వాళ్లంతా ఫూల్ అయ్యారు.

పూల్ అయి.. ఏప్రిల్1ని కొత్త సంవత్సరంగా.. 

1582లో  ఫ్రాన్స్ దేశ ప్రజలు.. జూలియన్ క్యాలెండర్‌కు ఎండ్ చెబుతూ.. గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. పోప్ గ్రెగొరీ 9 ఈ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రారంభించాడు. ఈ క్యాలెండర్‌లో నూతన సంవత్సరం జనవరి నుండి ప్రారంభమవుతుంది. దీనినే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. అయితే, అంతకు ముందు ఫ్నాన్స్ ప్రజలు వాడిన జూలియన్ క్యాలెండర్‌లో కొత్త సంవత్సరం ఏప్రిల్ 1 న మొదలవుతుంది. 

అయితే, పోప్ చార్లెస్ 9  ప్రవేశ పెట్టిన గ్రెగోరియన్ క్యాలెండర్‌ను గుర్తించని కొంతమంది ప్రజలు.. చాలాకాలం ఏప్రిల్ 1ని కొత్త సంవత్సరంగా జరుపుకున్నారు. దాంతో మిగిలిన ప్రజలు ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం జరుపుకున్న వాళ్లను ఫూల్స్‌గా పిలవడం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి ఏప్రిల్ 1 ఫూల్స్ డే గా ప్రాచుర్యంలోకి వచ్చింది.