మూడేళ్ల కూతుర్ని చంపి.. ఫ్యాన్ కు ఉరేసుకుంది

V6 Velugu Posted on Apr 23, 2021

  • అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్: అభం శుభం తెలియని మూడేళ్ల అందమైన కూతురిని చంపేసి.. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పాత అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో చోటు చేసుకుందీ ఘటన. తల్లీ కూతుర్లిద్దరూ ఒడిస్సా రాష్ట్రం నుండి వలస వచ్చి జీవిస్తున్నట్లు తెలిసింది. భర్తతో కొట్లాడి తీవ్ర మనస్తాపంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బిష్ణు ప్రియ(30)గా గుర్తించారు. అందమైన కూతురితో ఆనందంగా గడపాల్సిన ఆమె ఏం కష్టమొచ్చిందో.. ఎంత వేదనకు గురైందో గానీ.. నవ మాసాలు మోసి.. కని.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ముద్దులొలికే మూడేళ్ల పాపను చంపేసి... ఆ తర్వాత తనూ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది. కొన్నేళ్ల క్రితం ఒడిసా రాష్ట్రానికి చెందిన భర్త సుదేందు గిరితో కలసి వచ్చి జీవిస్తోంది. సుదేందు గిరి, బిష్ణు ప్రియ దంపతులకు మూడేళ్ల కూతురు సంతానం. భర్త గిరి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆఫీసుకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగొచ్చిన తర్వాత బెడ్ రూమ్ లో భర్త ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయి ఉంది. మూడేళ్ల కూతుర్ని కూడా ఆమె చంపేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకోని ఉంటుందనే కోనంలో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక పక్కా ఆధారాలతో వాస్తవాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

Tagged woman suicide, , alwal ps limits, alwal bharath nagar, suicide hanging, bishnu priya(30), woman and daughter suicide

Latest Videos

Subscribe Now

More News