దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం.. ఒకరు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం.. ఒకరు మృతి
  • దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం.. ఒకరు మృతి
  •  పూర్తిగా జలమయమైనా పలు ప్రాంతాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో వరద నీరు ఏరులై పారింది. మింటో బ్రిడ్జి దగ్గర వరద నీటిలో చిక్కుకుని 60 ఏళ్ల ముసలాయన చనిపోయాడు. కున్‌దన్‌ అనే ట్రక్కు డ్రైవర్‌‌ కన్ననాట్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. వరద నీటిలో నుంచి ట్రక్కును తీసుకెళ్లాలని చూశారని, కానీ ట్రక్కును ముందుకు తీసుకెళ్లలేక నీటిలో మునిగిపోయాడు అని చెప్పారు. ప్యాసింజర్‌‌ బస్సు నీటిలో ఇరుక్కుపోతే ప్యాసింజర్లు కాపాడామని ఫైర్‌‌ అధికారులు చెప్పారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయని, నీరు పొంగిపొర్లుతుందని ఢిల్లీ వాసులు వీడియోలు, ఫొటోలు షేర్‌‌ చేశారు. సఫ్దార్‌‌ గంజ్‌లో 4.9 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు చెప్పారు. ఢిల్లీ – ఎన్సీఆర్‌‌ పరిధిలోని చాలా ప్రదేశాల్లో వర్రషాలు కురుస్తాయని అన్నారు. నార్త్‌ వెస్ట్‌ ఇండియాలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు.