24 గంటల్లో.. అప్పుడే పుట్టిన 10 మంది పిల్లలు చనిపోయారు..

24 గంటల్లో.. అప్పుడే పుట్టిన 10 మంది పిల్లలు చనిపోయారు..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో మరణ మృదంగం మోగుతోంది.  24 గంటల్లో 10 మంది చిన్నారులు మరణించడం కలకలం రేగుతోంది. ఇంకా చాలా మంది నవజాత శిశువుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది. వైద్య కళాశాలలోని ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో నవజాత శిశువులు మృతి చెందారు.  

ఒకేసారి ఇంత భారీ  సంఖ్యలో నవజాత శిశువులు చనిపోవడంతో పశ్చిమ బెంగాల్ ఆరోగ్య వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే తమ చిన్నారుల మరణానికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.

జంగీపూర్ సూపర్ స్పెషాలిటీ పిల్లల ఆసుపత్రికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వస్తుంటారు. ఈ ఆసుపత్రిలో చికిత్స అందించలేని సమయంలో అప్పుడు అప్పుడే పుట్టిన శిశువులను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు.

ఈ ఘటనపై ఇప్పటికే ఓ కమిటీ వేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. దర్యాప్తు అనంతరం ఈ ఘటనలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే.. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు.