మీకు తెలుసా : గూగుల్ పే ద్వారా అప్పు ఎలా తీసుకోవచ్చు.. ఏయే బ్యాంకులు ఇస్తాయి..

మీకు తెలుసా : గూగుల్ పే ద్వారా అప్పు ఎలా తీసుకోవచ్చు.. ఏయే బ్యాంకులు ఇస్తాయి..

డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఇటీవల దేశంలో తన డిజిటల్ క్రెడిట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సాచెట్ లోన్ కింద చిన్న తరహా వ్యాపారులు దాదాపు రూ.15వేల వరకు రుణాన్ని పొందవచ్చు. నెలవారీ ఈఎంఐలుగా రూ. 111 కంటే తక్కువ మొత్తంలో తిరిగి చెల్లించవచ్చు. ఇందుకు గానూ డీఎంఐ ఫైనాన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశంలోని వ్యాపారులకు తరచుగా చిన్న రుణాలు అవసరమవుతాయని, అందుకే గూగుల్ పే అప్లికేషన్‌పై సాషే లోన్‌లను ప్రారంభించామని గూగుల్ ఇండియా ఈ సందర్భంగా తెలిపింది.

అత్యవసర మెడికల్ బిల్లులు లేదా ఇతర ఊహించని ఖర్చుల కోసం ఈ లోన్స్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ కోసం గూగుల్.. ఫెడరల్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ అనే నాలుగు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లోన్ సేవను గూగుల్ పే ఇటీవల టైర్ 2నగరాల్లో మాత్రమే ప్రారంభించింది.

బిజినెస్ కోసం గూగుల్ యాప్ ను ఓపెన్ చేసి.. లోన్ సెక్షన్ లోని ఆపర్స్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. రుణ మొత్తాన్ని నమోదు చేయగానే.. షేరింగ్ సైట్ కు వెళుతుంది. ఆ తర్వాత కొన్ని ఈజీ స్టెప్స్ పూర్తి చేశాక.. లోన్ ను పొందవచ్చు.