భోపాల్ గ్యాస్ ఘటన నుంచి తప్పించుకున్న 102 మంది కరోనాతో మృతి

భోపాల్ గ్యాస్ ఘటన నుంచి తప్పించుకున్న 102 మంది కరోనాతో మృతి

మధ్యప్రదేశ్‌లో 1984లో జరిగిన భోపాల్‌ గ్యాస్ ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. అప్పడు ఆ ఘటనలో అనారోగ్యంపాలై కోలుకున్న కొంతమంది తాజాగా కరోనావైరస్ బారినపడి మరణించారు. భోపాల్ గ్యాస్ విషాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 102 మంది కరోనావైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగి 36 ఏండ్లు గడిచింది. డిసెంబర్ 2-3, 1984న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీకైంది. దాని బారినపడి 15 వేల మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఈ విష వాయువు వల్ల దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని సమాచారం.

భోపాల్‌లో ఇప్పటివరకు కరోనా బారినపడి 518 మంది మరణించారు. వారిలో 102 మంది భోపాల్ గ్యాస్ విషాదంలో ప్రాణాలతో బయటపడినవారే కావడం గమనార్హం. వీరిలో 69 మంది 50 ఏళ్లు పైబడిన వారు కాగా.. మిగిలిన 33 మంది 50 ఏళ్లలోపు వారు. కరోనాతో చనిపోయిన 518 మంది గానూ.. 450 మంది ఇళ్లను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ 450 మందిలో 254 మంది భోపాల్ బాధితులేనని అధికారులు తెలిపారు. భోపాల్ ప్రమాదం నుంచి బయటపడిన వారికి కరోనా తొందరగా సోకుతుండటంతో చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. అందుకే వారందరికీ అదనపు పరిహారం కేటాయించాలని డిమాండ్ చేస్తూ కొన్ని ఎన్జీవో సంస్థలు బుధవారం కాగడాల ర్యాలీ నిర్వహించారు.

For More News..

మొదలైన రీపోలింగ్.. సిరా చూపుడు వేలుకు పెట్టట్లేరు