సీబీఐ కస్టడీ నుంచి 100 కిలోల బంగారం మాయం

సీబీఐ కస్టడీ నుంచి 100 కిలోల బంగారం మాయం

చెన్నై: అవినీతిపరుల గుండెల్లో దడ పుట్టించే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చిక్కుల్లో పడింది. తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103 కిలోల బంగారం అదృశ్యమవడం హాట్ టాపిక్‌‌గా మారింది. వీటి విలువ సుమారు రూ.45 కోట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో విషయం బయటపడింది. సీబీఐ కస్టడీ నుంచి మిస్సయిన బంగారం 2012లో చెన్నైలోని సురానా కార్పొరేషన్ లిమిటెడ్ మీద నమోదైన కేసులో సీబీఐ ఆ కంపెనీ నుంచి 400.47 కేజీల గోల్డ్‌‌ను స్వాధీనం చేసుకుంది.

బిస్కట్లు, ఆభరాణాల రూపంలో ఉన్న ఈ బంగారాన్ని కంపెనీ వాల్ట్‌‌లో దాచి, లాక్, సీల్ కూడా వేసింది. ఈ వాల్ట్ తాళాలను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. ఆ బంగారం మాయమైంది. లోకల్ పోలీసులతో ఇన్వెస్టిగేషన్ జరిపిస్తే ప్రతిష్ట దిగజారుతుందని, ఈ కేసును సీబీ-సీఐడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరడం గమనార్హం. అయితే సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. పోలీసులంతా నమ్మకస్థులేనని, అందులో సీబీఐ ఎక్కువ.. పోలీసులు తక్కువ అనడం సరికాదని పేర్కొంది.