జగిత్యాలలో గుండెపోటుతో 104 డ్రైవర్ మృతి

జగిత్యాలలో గుండెపోటుతో 104 డ్రైవర్ మృతి

జగిత్యాల జిల్లా: జగిత్యాలలో గుండెపోటుతో 104 డ్రైవర్ మృతి చెందాడు.  డ్యూటీలో ఉండగా రాజ్ కుమార్ అనే డ్రైవర్  అస్వస్థతకు గురయ్యాడు.  గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించారు. దీంతో   రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

 గత కొన్ని రోజులుగా రాజ్ కుమార్  DMHO ఆఫీస్ లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు. DMHO పుప్పాల శ్రీధర్ అదనపు డ్యూటీ చేయమని ఒత్తిడి చేయడంతో రెండు రోజులుగా రాజుకుమార్ డ్యూటీలోనే ఉన్నట్లు చెబుతున్నారు తోటి ఉద్యోగులు. రాజకుమార్ మృతికి DMHO నే కారణం అంటూ ఆందోళనకు దిగారు బంధువులు, తోటి సిబ్బంది.  గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడం, మరోవైపు పని ఒత్తిడి వల్ల మనస్థాపానికి గురైనట్లు ఆరోపిస్తున్నారు. రాజ్ కుమార్ మృతికి కారణమైన DMHO పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.