లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి

V6 Velugu Posted on Oct 28, 2021

దోడా: జమ్మూ కశ్మీర్‌‌లో ఘోరం చోటు చేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. గాయపడిన వారిని దోడాలోని హాస్పిటల్‌‌కు తరలించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం: 

ఒక్క మ్యాచ్.. ఎన్నో కేసులు, అరెస్టులు.. మరెన్నో వివాదాలు

టీటీడీ బోర్డులోని 18 మందికి హైకోర్టు నోటీసులు

మోడీని ఓడించినా.. బీజేపీని ఏమీ చేయలేరు

Tagged pm modi, jammu kashmir, bus accident, killed, passengers, Doda

Latest Videos

Subscribe Now

More News