
పాకిస్తాన్ ,ఆఫ్గనిస్తాన్ లను భూకంపం కుదిపేసింది . మార్చి 21 రాత్రి పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 నమోదయ్యింది. ఈ భూకంప ధాటికి 11 మంది మృతి చెందగా..100 మందికి పైగా గాయాలయ్యాయి. భూకంప తీవ్రతకు పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలర్ట్ అయిన ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది.
ఆఫ్గనిస్తాన్ లో హిందూ కుష్ ప్రాంతంలో 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు తీశారు.