CAA నిరసనల్లో 1,113 మంది అరెస్టు

CAA నిరసనల్లో 1,113 మంది అరెస్టు

యూపీ అధికార వర్గాల వెల్లడి

లక్నో: సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్టు(సీఏఏ)కు వ్యతిరేకంగా యూపీలో జరిగిన ఆందోళనల్లో 1,113 మంది నిరసనకారులు అరెస్టయ్యారని యూపీ అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి. రాష్ట్రంలోని చాలా సిటీల్లో ఫ్రైడే ప్రేయర్లను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్​ సర్వీసులను సస్పెండ్​  చేశారు.  ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ఘర్షణల్లో 19 మంది చనిపోయారని, 5,558 మందిని డిటెన్షన్ లో ఉంచినట్లు తెలిపాయి. వారం రోజుల్లో పోలీసుల కాల్పులు, లాఠీ చార్జీల్లో ఫిరోజబాద్ లో ఐదుగురు, మీరట్ లో నలుగురు, కాన్పూర్ లో ముగ్గురు, సంభాల్, బిజ్నోర్ లో ఇద్దరు చొప్పున, ముజఫర్ నగర్, రాంపూర్, లక్నో లలో ఒక్కొక్కరు చనిపోయారని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. అల్లర్లు జరిగిన వివిధ ప్రాంతాల నుంచి 35 అక్రమ ఆయుధాలను, 647 ఖాళీ క్యాట్రిడ్జిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిరసన ఘటనల్లో 351 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు.

సదాఫ్ పై అక్రమంగా కేసు

లక్నోలో సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న యూపీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, సోషల్ యాక్టివిస్ట్ సదాఫ్‌‌ జాఫర్ ని అన్యాయంగా అరెస్టు చేసి పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. జాఫర్ అరెస్టు గురించి వాకబు చేసేందుకు వెళ్లిన థియేటర్ ఆర్టిస్ట్ దీపక్ కబీర్​ను కారణం లేకుండా అరెస్టు చేశారని ఆయన కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ నెల 19న లక్నోలో పోలీస్ స్టేషన్ బయట పార్క్ చేసిన వెహికిల్స్ పై నిరసనకారులు రాళ్లు విసరడంతో పోలీసులకు వారికి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా సదాఫ్ జాఫర్​తో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆ కుటుంబాలను పరామర్శించను: యూపీ మంత్రి

బిజ్నోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: యూపీలో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ముస్లిం వ్యక్తుల కుటుంబాలను కలిసేందుకు యూపీ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపిల్‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ నిరాకరించారు. విధ్వంసం సృష్టించిన వారి కుటుంబసభ్యుల్ని కలవాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. “ బిజ్నోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంటల్లో కాల్చాలనుకున్న వారి కుటుంబాలను పరామర్శించాల్సిన అవసరం ఏముంది? ఇది హిందూ–ముస్లింలకు సంబంధించింది కాదు గొడవలు చేసే వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లాలి? ” అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

మరిన్ని వెలుగు వార్తలకు క్లిక్ చేయండి