ఇళ్లలో సెక్యూరిటీ కోసం కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ఈ రోజుల్లో సహజంగా మారిపోయింది. అయితే దక్షిణ కొరియాలోని కొందరు నేరగాళ్లు దీనినే టార్గెట్ చేశారు. ఇళ్లు, ఆఫీసులకు సంబంధించిన దాదాపు లక్షా 20వేల సీసీ కెమెరాలను హ్యాక్ చేశారు. ఇదంతా చేసింది కేవలం సెక్సువల్ వీడియోల డేటా కోసమేనని తేలటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సింపుల్ పాస్ వర్డ్ కలిగిన ఇంటర్నెట్ కనెక్టెడ్ కెమెరాలను దీనికోసం వారు టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. వాస్తవానికి సీసీ కెమెరాల కంటే ఈ ఐపీ కెమెరాలు తక్కువ ఖర్చులో వస్తుండటంతో ప్రజలు తమ ఇళ్ల వద్ద పిల్లలు, పెంపుడు జంతువుల రక్షణ కోసం ఎక్కువగా వీటిని వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే వారు సౌత్ కొరియాలోని ఇళ్లు, సౌండ్ ఫ్రూఫ్ రూమ్స్, జిమ్స్, గైనిక్ హాస్పిటల్స్ వంటి చోట్ల ఉండే కెమెరాలను హ్యాక్ చేసినట్లు గుర్తించబడింది. ఒక నిందితుడు 63వేల కెమెరాలు హ్యాకింగ్ చేసి 545 లైంగికపరమైన కంటెంట్ ఉన్న వీడియోలను తయారు చేసి రూ.22 లక్షలకు విక్రయించినట్లు తేలింది. మరో నిందితుడు 70వేల కెమెరాల నుంచి 648 వీడియోల డేటా అమ్మి రూ.11 లక్షలు సొమ్ము చేసుకున్నాడు.
►ALSO READ | షేమ్ షేమ్..కాలం చెల్లిన వస్తువులు పంపిస్తారా?.. శ్రీలంకకు పాకిస్తాన్ మానవతా సాయంపై నెటిజన్ల ఫైర్
గడచిన ఏడాది కాలంలో హ్యాక్ చేయబడిన ఐపీ-కెమెరా ఫుటేజీని చట్టవిరుద్ధంగా పంపిణీ చేసిన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయబడిన మొత్తం వీడియోల్లో ఈ ఇద్దరు అనుమానితులి వాటా 62% అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అధికారులు ఆ సైట్ బ్లాక్ చేసేందుకు, దానిని మూసేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేటర్‌పై దర్యాప్తు చేయడానికి విదేశీ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నారు. ఇళ్లలో లేదా వ్యాపార సముదాయాల్లో ఐపీ కెమెరాలు అదే ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసి యాప్స్ ద్వారా యూజ్ చేసే కెమెరాల విషయంలో సాస్ వర్డ్ బలంగా ఉండేలా చూసుకోవాలని, వాటిని తరచుగా మార్చుతూ ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
