సీఎం కాన్వాయ్‌పై దాడి.. 13 మంది అరెస్టు

 సీఎం కాన్వాయ్‌పై దాడి.. 13 మంది అరెస్టు

బిహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడి ఘటనలో  13 మంది నిందితలను అరెస్టు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సీఎం నితీష్.. నేడు గయాలో పర్యటించాల్సి ఉంది. ఆయన గయా పట్టణానికి హెలీకాప్టర్‌లో చేరుకోనున్నారు. ఈనేపథ్యంలో సీఎం స్థానికకంగా తిరగడంకోసం సీఎం కాన్వాయ్‌లోని కార్లు ఆదివారం సాయంత్రం గయాకు బయలుదేరాయి.

అయితే కొందరు యువకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గయా హైవేపై దర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆటు వైపు సీఎం కాన్వాయ్‌ రావడంతో వారు ఆ కార్లపై రాళ్లు విసిరారు. దీంతో నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ  సంఘటన సమయంలో సీఎం ఆ కార్లలో లేరని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి13 మంది నిందితులను అరెస్టు చేశారు.