అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం : మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం : మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ సిటీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దెబ్బతిన్న అంతర్గత రోడ్లను గుర్తించి డ్రైనేజీలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి సుడా నిధులు, మున్సిపల్ సాధారణ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. 

సరస్వతినగర్ డివిజన్‌‌‌‌‌‌‌‌లో సీసీ రోడ్డు,  కోతిరాంపూర్ డివిజన్‌‌‌‌‌‌‌‌లో గణేశ్‌‌‌‌‌‌‌‌నగర్ లింకు రోడ్డు నిర్మాణాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో లీడర్లు చెర్ల పద్మ, ఎట్టెపు వేణు, బత్తిని చంద్రయ్య, బేతి సుధాకర్ రెడ్డి, గౌరయ్యగౌడ్, సత్తినేని శ్రీకాంత్, బత్తిని శ్రీకాంత్, వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, విఠల్  పాల్గొన్నారు.