
ఫ్రాన్స్ లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కూలిన హెలికాప్టర్ లో 13 మంది జవాన్లు చనిపోయారు. మాలిలో జిహాదిస్టులపై జవాన్లు దాడులు జరుపుతున్నారు. అదే సమయంలో వారి హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న 13 మంది జవాన్లు చనిపోయారు. విషయం తెలుసుకున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.