కొత్తగా ఓటరు నమోదుకు 3,484 అప్లికేషన్లు

కొత్తగా ఓటరు నమోదుకు 3,484 అప్లికేషన్లు

కామారెడ్డి, వెలుగు: కొత్తగా ఓటరు నమోదుతో పాటు, మార్పులు, చేర్పుల కోసం శని, ఆదివారాల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4,510 అప్లికేషన్లు వచ్చాయి. కొత్తగా ఓటరు కోసం 3,484, మార్పులు, చేర్పుల కోసం 1,026 అప్లికేషన్లు వచ్చాయి. 

కామారెడ్డి నియోజకవర్గంలో కొత్త ఓటర్ల కోసం1,336, ఎల్లారెడ్డిలో 646, జుక్కల్​లో 1,502 దరఖాస్తులు వచ్చాయి.  భిక్కనూరులో జరిగిన స్పెషల్​డ్రైవ్​ను కలెక్టర్​జితేశ్​వి పాటిల్, జిల్లా కేంద్రంలో అడిషనల్​కలెక్టర్​ చంద్రమోహన్, ఆర్డీవో శ్రీనివాస్​రెడ్డి పరిశీలించారు.