
హైదరాబాద్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు 137 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారని హైదరాబాద్ జిల్లా ఎలక్షన్ అథారిటీ అధికారి తెలిపారు. ఈనెల 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగనుందని పేర్కొన్నారు. 12 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. జిల్లాల్లో మొత్తంగా 27,720 మంది ఎమ్మెల్సీ టీచర్స్ నియోజకవర్గ ఎన్నికలకు ఓటర్లుగా నమోదయ్యారని వివరించారు.