తెలంగాణలో గత 24 గంటల్లో 1,380 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 1,380 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,380 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105, రంగారెడ్డి జిల్లాలో 69, నల్గొండ జిల్లాలో 59 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,877 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు చనిపోయారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,78,910 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,50,809 మంది కోలుకున్నారు. ఇంకా 24,000 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,101కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం మరణాల రేటు 0.53 శాతానికి పడిపోగా, రికవరీ రేటు 96.39 శాతంగా ఉంది.

మరిన్ని వార్తల కోసం...

జంట టవర్లను రెండు వారాల్లో కూల్చేయండి