సిరిసిల్ల జిల్లాలో 24 చెక్ డ్యాంలకు 140.26 కోట్లు రిలీజ్ 

సిరిసిల్ల జిల్లాలో 24 చెక్ డ్యాంలకు 140.26 కోట్లు రిలీజ్ 

రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు, మూలవాగు వాగులపై నిర్మించతలపెట్టిన 24 చెక్ డ్యాంల పనులు ఆగుతూ సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన ఏడు  చెక్​డ్యాంలు మొన్నటి వరదలకు కొట్టుకుపోయాయి. కాంట్రాక్టర్ల నాసిరకం పనులు బయటపడ్డాయి. మూడేళ్లుగా సాగదీత జిల్లాలో 24 చెక్  డ్యాంలలో గతేడాది కాంట్రాక్టర్లు ఏడు పూర్తిచేశారు. వరదలకు అవి కొట్టుకుపోవడం.. మిగతా డ్యాంల పనులు పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది.  వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, జయవరం, మల్లారం ఏరియాల్లో రెండేళ్లుగా చెక్ డ్యాంల పనులు కొనసాగుతున్నాయి. కోనరావుపేట మండలం మూలవాగు మీద మరిమడ్ల, నిమ్మపల్లి,కొండాపూర్, వెంకట్రావుపేట,నిజామాబాద్, మామిడిపల్లి గ్రామాల మధ్య ఆరు చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు.  

వెంకట్రావుపేట, మామిడిపల్లి డ్యాంల పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. గత వర్ష కాలంలో మూలవాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పనులు ముందుకు సాగలేదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మరిమడ్ల, నిమ్మపల్లి,కొండాపూర్, నిజామాబాద్​చెక్​డ్యాంల పనులు పూర్తయ్యాయి. బోయినిపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల పరిధిలో మిడ్ మానేర్ ప్రాజెక్టు కింది భాగంలో రెండు చెక్ డ్యాంల కోసం ఆఫీసర్లు ప్రతిపాదించిన నీటినిల్వ కారణంగా క్యాన్సిల్​చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం మానేరు వాగుపై పదిర గ్రామంలో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణంలో క్వాలిటీ పాటించడంలేదని ఆ మండల బీజేపీ లీడర్లు పలుమార్లు పనులను అడ్డుకున్నారు.

నీళ్లు ఆగుతలె..


ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాంలో క్వాలిటీ పాటించడంలేదు. కాంక్రీటు సరిగా వేయకపోవడంతో నీరు ఆగడంలేదు. ఇలాంటి పనులు చేసి ఏంలాభం
– బుగ్గారెడ్డి రైతు,ఎల్లారెడ్డిపేట

అన్ని పూర్తిచేస్తాం..


వాగుల్లో నీరు ఉండటంతో చెక్ డ్యాం పనులు సాగలేదు. ఈ ఏడాది వేసవిలో నీటి నిల్వ తక్కువ ఉంటుంది. మిగిలి ఉన్న పనులన్నీ పూర్తిచేస్తాం. ఇప్పటికే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి.
– అమరేందర్ రెడ్డి,ఈఈ మిషన్ భగీరథ

ఇసుక దోపిడీ..


చెక్ డ్యాంల పనులు పూర్తికాకపోవడంతో నీరు నిల్వ ఉండటం లేదు. అయితే పనుల కోసం వేములవాడలో కంకర, ఇసుక, మిక్సింగ్ ప్లాంట్  ఏర్పాటు చేశారు. వీటిలో ఒకదానికి మాత్రమే కమర్షియల్ వాడకానికి పర్మిషన్​ ఉంది. అయితే పనులు చెక్​డ్యాంల పనుల సాకుతో మానేరు, మూలవాగు నుంచి రాత్రి పూట అక్రమార్కులు జోరుగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట,ముస్తాబాద్ మండలాల్లో మానేరు వాగును తోడేస్తున్నారు. అయినా ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.