ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీలో 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 14729 మంది మృతి చెందారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైరస్ బారిన పడి ఒక్కొక్కరు చనిపోయారు. కృష్ణా జిల్లాలో 41, పశ్చిమగోదావరి జిల్లాలో 23 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
