ఎయిర్ బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని మట్టుపెట్టాం: ఉక్రెయిన్

ఎయిర్ బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని మట్టుపెట్టాం: ఉక్రెయిన్

పాతిక రోజులుగా రష్యా దాడులు చేస్తున్నా ఉక్రెయిన్ దళాలు తగ్గేదేలే అంటూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ప్రపంచ దేశాలు అందిస్తున్న సాయంతో ఉక్రెయిన్ దళాలు రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ మరో రష్యా జనరల్ ను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఇప్పటి వరకు 14 వేల 700 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 476 యుద్ధ ట్యాంకులు, 1487 సాయుధ వాహనాలు, 96 విమానాలను ధ్వంసం చేశామని ప్రకటించారు. 118  హెలికాప్టర్లు, 21 యూఏవీలను నేలకూల్చినట్లు చెప్పారు. రష్యాకు చెందిన ఎయిర్ బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని తమ దళాలు మట్టుపెట్టి నాశనం చేశాయని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ ప్రకటనను రష్యా అంగీకరించలేదు. తమ సైనికులు కేవలం 500 మంది మాత్రమే చనిపోయారని చెబుతోంది. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ప్రింటింగ్ పేపర్ లేకపోవడంతో బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

ప్రపంచ విద్యా వ్యవస్థలో భారత్ది 3వ స్థానం