ఏపీలో పెళ్లిళ్లకు ఇకపై 150 మందికి అనుమతి

ఏపీలో పెళ్లిళ్లకు ఇకపై 150 మందికి అనుమతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడలిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇప్పటివరకు పెళ్లిళ్లకు 20 మందికి మాత్రమే అనుమతి ఉండగా.. ఇకపై వివాహాలు, ఇతర శుభకార్యాలతోపాటు మతపరమైన సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య 150కి మించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేర్కొంది.


వేదికలు, ఇతర చోట్ల సీట్లు పక్కపక్కనే ఉంటే మధ్యలో ఒకదానిని విడిచిపెట్టాలని ఉత్తర్వుల్లో తెలిపింది. సీట్లు కనుక ముందుగా అమర్చకుండా ఉంటే ఒక సీటుకు మరో సీటుకు మధ్య 5 అడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది.దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

 
మరోవైపు..కరోనా రూల్స్ కఠినంగా పాటించాలని, మాస్కులు కచ్చితంగా ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చారు. తాజా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తగిన ప్రణాళిక రూపొందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.