కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ డివిజన్‌‌‌‌లో .. పులిని చంపిన కేసులో 16 మంది రిమాండ్

 కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ డివిజన్‌‌‌‌లో .. పులిని చంపిన కేసులో 16 మంది రిమాండ్

ఆసిఫాబాద్, వెలుగు : కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ డివిజన్‌‌‌‌లోని నల్లకుంట వద్ద ఈ నెల 15 పులిని చంపిన కేసులో 16 మందిని శుక్రవారం రిమాండ్‌‌‌‌కు తరలించారు. డీఎఫ్‌‌‌‌వో నీరజ్‌‌‌‌కుమార్‌‌‌‌ టిబ్రేవాల్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... పెంచికల్ పేట రేంజ్‌‌‌‌ పరిధిలో నిందితులు విద్యుత్‌‌‌‌ తీగలు అమర్చి పులిని చంపడంతో పాటు దాని చర్మం, గోళ్లు, దంతాలు ఎత్తుకెళ్లారు.

 కేసు నమోదు చేసి అప్పాజి శ్రీనివాస్‌‌‌‌, అప్పాజి వెంకటేశ్, ఎల్కరి శేఖర్, చప్పిడి అశోక్‌‌‌‌తో పాటు రాచకొండ లచ్చయ్య, రోహిణి శ్రావణ్, ఎల్కరి ప్రకాశ్‌‌‌‌, చప్పిడి పవన్, కటేల సాగర్, లేగల గోపాల్, బుర్రి వెంకటేశ్, బింకరి రంగయ్య, కొండ్రే సంతోశ్, బింకరి వెంకటేశ్, లాట్‌‌‌‌కారి శ్రీనివాస్, నికోడే వెంకటేశ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని శుక్రవారం సిర్పూర్‌‌‌‌ టి కోర్టు ఇన్‌‌‌‌చార్జి జిల్లా జూనియర్‌‌‌‌ సివిల్‌‌‌‌ జడ్జి అనంతలక్ష్మి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధింంచినట్లు డీఎఫ్వో తెలిపారు.