లోక్ సభలో ఎంపీల పనితీరుపై పూర్తి డీటేల్స్

లోక్ సభలో ఎంపీల పనితీరుపై పూర్తి డీటేల్స్

16 లోక్ సభ ముగియబోతోంది. వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మరి ఐదేళ్లలో మన నియోజకవర్గ ఎంపీ పని తీరు ఎలా ఉంది? అసలు లోక్ సభకు హాజరయ్యారా? ఎన్ని రోజులు వెళ్లారు? ఏవైనా ప్రశ్నలు అడిగారా? రాజకీయ పార్టీ లేదా రాష్ట్రం తరఫున లోక్ సభలో సభ్యుల ప్రాతినిథ్యం ఎలా ఉంది? రాష్ట్రా సభ్యుల హాజరు శాతం ఎలా ఉంది? వీటన్నింటి సమాధానాలు, పూర్తి సమాచారంతో యాప్ లో అందుబాటులోకి వచ్చింది.

  • 545 మంది లోక్ సభ ఎంపీల్లో 9
  • మంది మాత్రమే 100% హాజరు
  • 178 మంది ఎంపీలకే 90 శాతం
  • ఒక్క ప్రశ్న కూడా అడగని 44 మంది
  • 500 చొప్పున ప్రశ్నలు అడిగిన 60 మంది సభ్యులు
  • సగం ప్రశ్నలకు కూడా సమాధానమివ్వని బీజేపీ ప్రభుత్వం

 లోక్​సభలో 545 మంది ఎంపీలు ఉంటే కేవలం  9 మందికి మాత్రమే సమావేశాలు జరిగిన అన్ని రోజులూ హాజరయ్యారు. అమృత్ సర్ ఎంపీగా పని చేసిన అమరీందర్ సింగ్ అతి తక్కువగా 6 శాతం హాజరు నమోదు చేశారు. ఆయన తర్వాత ఘాటల్ ఎంపీ అధికారి దీపక్ 9 శాతం మాత్రమే వచ్చారు.34 మంది ఎంపీలు పార్లమెం ట్ సమావేశాలకు50 శాతం కన్నా తక్కువగా హాజరయ్యారు. 178 మంది ఎంపీలకు 90 శాతం అడెండెన్స్ ఉండగా,ఇందులో బీజేపీ సభ్యులు 140 మంది ఉన్నారు. ఈ మేరకు 2014–2018 మధ్య లోక్​సభలో సభ్యుల పని తీరుకు సంబంధించి న సమగ్ర సమాచారాన్ని కొం దరు రీ సెర్చర్లు విశ్లేషిం చారు. https://metrics-loksabha.shinyapps.io/mpperformance/ పేరుతో రూపొందించిన వెబ్ బేస్డ్ అప్లికేషస్‌‌‌‌లో మొత్తం డేటాను పొందుపరిచారు. రాష్ర్టాలు, రాజకీయ పార్టీల నుంచి ఎన్ని కైన పార్లమెంట్ మెంబర్ల పనితీరును అప్ లోడ్ చేశారు. పబ్లిక్​లో అందుబాటులో ఉన్న డేటా సెట్స్ (సేకరించినసమాచారం) అధారంగా ఈ యాప్ పని చేస్తుంది.యూనివర్సిటీ ఆఫ్ షికాగో పీహెచ్డీ స్టూడెంట్ శివా చిదంబరం, సిరాకస్ యూనిర్సిటీ పీహెచ్ డీ స్టూడెం ట్ నోహా మోహన్ బాబు, స్టోవర్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌‌‌‌లో రీసెర్చర్ విరాజ్ దొడ్డిహాల్..ఈ యాప్ ను రూపొందించారు. ‘పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్’ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి డేటాను సేకరించి విశ్లేషించి ఈ యాప్ లో అప్ లోడ్ చేశారు.

రాష్ర్టా హాజరు శాతం ఎంత?

రాష్ర్టాల పరంగా చేస్తే మణిపూర్, మిజోరం,నాగాలాండ్ ఎంపీలకు 90 శాతం హాజరు పడింది.ఆ తర్వాత ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ర్టాల సభ్యుల హాజరు మెరుగ్గా ఉంది. ఇక అతి తక్కువగా జమ్మూకాశ్మీర్ సభ్యులు కేవలం 55 శాతం మాత్రమే హాజరు నమోదు చేశారు. దాని కన్నా కొంచెం మెరుగ్గా పశ్చిమె బెంగాల్(65),తెలంగాణ(69), పంజాబ్ (69) రాష్ర్టాలు ఉన్నాయి.

మీ ఎంపీ తరచూ ప్రశ్నలు అడుగుతున్నారా?

సభ ప్రారంభమైన తొలి గంటను ప్రశ్నోత్తరాలకు కేటాయిస్తారు. ఒకసారి సభ సమావేశమైతే సగటున 1000 ప్రశ్నలను సభ్యులు అడుగుతారు. మంత్రులు రాతపూర్వకంగా లేదా మౌఖికంగా సమాధానమిస్తారు. ఈ మేరకు మొత్తం 545 మంది ఎంపీల్లో 44 మంది గత నాలుగేళ్లలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 76 మంది 10 లోపు ప్రశ్నలు మాత్రమే అడిగారు.అధికార బీజేపీ ఎంపీలను ఈ కేటగిరీ నుంచి మినహాయించినా .. మొత్తంగా 57 మందే 10 కన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఇందులో 21 మంది పశ్చిమ బెంగాల్ ఎంపీలు ఉన్నారు. 60 మంది ఎంపీలు ఒక్కొక్కరు 500 కన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఈ 60 మందిలో 9 మంది మహారాష్ర్ట ఎంపీలు ఉండగా, సగటున 900 ప్రశ్నల కన్నా ఎక్కువ అడిగారు.

ప్రశ్నలకు సమాధానాల తీరు

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే బీజేపీ హయాం లో సభలో సమాధానాల శాతం తగ్గింది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్రమే సమాధానాల విషయంలో కొంత మెరుగైంది.మిగిలిన మంత్రిత్వ శాఖలన్నీ గత ప్రభుత్వం కన్నా తక్కువ సమాధానాలు ఇచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే యూపీఏ హయాం లోని 20 శాఖలు 20శాతం ఎక్కువ సమాధానాలు ఇచ్చాయి. ఉదాహరణకు 2009–2014 కాలంలో యూపీఏ హయాంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖను సభ్యులు 5,733ప్రశ్నలు అడిగితే, 5,013 ప్రశ్నలకు సమాధానమిచ్చిం ది. అదే ఎన్డీఏ హయాంలో పెట్రోలియం శాఖను 7,395 ప్రశ్నలు అడిగితే, కేవలం 3,408 ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చింది. అంటే దాదాపు 50 శాతం ప్రశ్నలకు బదులివ్వలేదు. మొత్తంగా చూస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే బీజేపీ హయాంలో సభ్యుల హాజరు, అడుగుతున్న ప్రశ్నలు పెరిగాయి. యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ హయంలో ప్రశ్నలకు సమాధానాలు తగ్గాయి.

  • 2012 నుంచి 2018 వరకు సభ్యులు అడిగిన ప్రశ్నలు         2.92 లక్షలు
  • ఎన్డీయే ప్రభుత్వం సమాధానం  ఇచ్చిన ప్రశ్నలు                 1.40 లక్షలు
  • సమాధానాల శాతం                                                       48
  • 2009 నుంచి 2014 వరకు సభ్యులు అడిగిన ప్రశ్నలు         2.33 లక్షలు
  • యూపీఏ ప్రభుత్వం సమాధానం ఇచ్చిన ప్రశ్నలు               1.55 లక్షలు
  • సమాధానాల శాతం                                                       66.6
  • వంద శాతం హాజరైన ఎంపీలు                                         9మంది
  • 500 కన్నా ఎక్కువ ప్రశ్నులు అడిగిన ఎంపీలు                  60 మంది
  • ఒక్క ప్రశ్నకూడా అడగని ఎంపీలు                                   44 మంది