సోషల్ మీడియాలో 54 సెకన్ల వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇండియా టుడే ప్రకారం.. మెక్సికోకు చెందిన 16 ఏళ్ల అలెగ్జాండర్ మార్టి నెజ్ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం డెడ్ బాడీతో అతని స్నేహితులు చేసిన ఓ చిన్న పని మిలియన్ల హృదయాల్ని కొల్లగొట్టింది. హత్యకు గురైన బాలుడికి ఫుట్ బాల్ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే అంత్యక్రియలు కొద్ది క్షణాల్లో జరగాల్సి ఉండగా.. స్నేహితులు ఆ బాలుడి శవ పేటికను స్టేడియానికి తీసుకొచ్చారు. స్నేహితులు రెండు గ్రూపులుగా విడిపోయి గోల్ కొట్టారు. వైరల్ అవుతున్న వీడియోలో శవ పేటికను నేలపై ఉంచారు. ఒక గ్రూప్ సభ్యుడి గోల్ కొట్టగా ఆ బంతి నేరుగా అలెగ్జాండర్ శవ పేటికకు తగిలి డైరెక్ట్ గా గోల్ పడుతుంది. అనంతరం విషాదంలో మునిగిన అతని స్నేహితులు శవ పేటికపై పడి కన్నీరు మున్నీరుగా విలపించడం హృదయాల్ని ద్రవించి వేస్తుంది.
#Oaxaca | #Cuenca ? Compañeros de Alexander lo despiden, mete su último gol. pic.twitter.com/dJ9hY2DaTW
— Noticias de Oaxaca | TVBUS (@tvbus) June 11, 2020
