17వ లోక్‌‌‌‌సభకు 78 మంది మహిళా ఎంపీలు

17వ లోక్‌‌‌‌సభకు 78 మంది మహిళా ఎంపీలు

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌‌‌‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందనప్పటికీ లోక్‌‌‌‌సభకు వెళ్లే మహిళల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మహిళా క్యాండిడేట్లు చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌‌‌‌సభకు పోటీ చేసిన 724 మంది క్యాండిడేట్లలో 78 మంది మహిళా ఎంపీలు గెలిచారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇంత మంది మహిళలు గెలవడం ఇదే మొదటిసారి. వారిలో యూపీ, పశ్చిమ బెంగాల్‌‌‌‌ నుంచి గెలిచిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇప్పుడు మహిళా ఎంపీల శాతం 14కు పెరిగింది. 41 మంది సిట్టింగ్‌‌‌‌ ఎంపీల్లో ఈ సారి 27 మంది గెలిచారు.

యూపీఏ ఛైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ సోనియా గాంధీ, హేమా మాలిని, కిరణ్‌‌‌‌ఖేర్‌‌‌‌‌‌‌‌, కనిమొళి, స్మృతి ఇరానీ, సాధ్వీ ప్రజ్ఞా సింగ్, రీటా బహుగుణ, బెంగాల్‌‌‌‌ నటి లాకెట్‌‌‌‌ ఛటర్జీ తదితరులు గెలిచిన వారిలో ప్రముఖులు. మొదటి, రెండో లోక్‌‌‌‌సభకు 24 మంది మహిళా ఎంపీలు గెలిచారు. మూడో లోక్‌‌‌‌సభకు 37 మంది గెలుపొందారు. అక్కడ నుంచి మహిళా ఎంపీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే 16 వ లోక్‌‌‌‌సభలో 64 మంది లేడీ ఎంపీలు ఉన్నారు. 104 మంది మహిళా అభ్యర్థులతో ఉత్తర‌‌‌‌ప్రదేశ్, మహారాష్ట్ర ఫస్ట్‌‌‌‌లో ఉన్నాయి. తమిళనాడు నుంచి 64, బీహార్‌‌‌‌‌‌‌‌ నుంచి 55, పశ్చిమ బెంగాల్‌‌‌‌ నుంచి 54 మంది పోటీ చేశారు.