LIC ఉద్యోగులకు గుడ్న్యూస్.. 17శాతం జీతాలు పెంపు..లక్షమందికి బెనిఫిట్

LIC ఉద్యోగులకు గుడ్న్యూస్.. 17శాతం జీతాలు పెంపు..లక్షమందికి బెనిఫిట్

LIC ఉద్యోగల జీతాలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎల్ ఐసీ సిబ్బందికి బేసిక్ లో 174 శాతం పెంపును శుక్రవారం ( మార్చి 15) కేంద్రం ఆమోదించింది. వేతనాల పెంపు, భత్యాలతో కలిపి 22 శాతం వరకు వస్తుంది. దీంతో లక్ష మంది ఉద్యోగులు, 30వేల మంది పెన్షనర్లకు బెనిఫిట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఎల్ ఐసీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ఈ వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎల్ ఐసీ కృతజ్ణతలు తెలిపింది. పెరిగిన జీతాలు ఆగస్టు 2022 నుంచి అమలు చేస్తారు. 

ఇటీవల డియర్ నెస్ అలవెన్స్ లో 50 శాతం పెంచిన తర్వాత తాజాగా ఈ పెంపుతో ఎల్ ఐసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ లో 4 శాతం పెంచింది ప్రభుత్వం. ఎల్ ఐసీ ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ ప్రక్రియను చేపడుతోంది. తాజా వేతన సవరణతో ఎల్ ఐసీయన్లపై సానుకూల ప్రభావం చూపుతుందని, భవిష్యత్ తరానికి ఎల్ ఐసీని మరింత ఉపాధి కల్పిస్తుందని బీమా సంస్థ పేర్కొంది.