మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కోయంబత్తూర్లో మార్చి 18న ప్రధాని మోదీ రోడ్ షో కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులతో ప్రధాని మోదీ రోడ్ షో కు అనుమతించింది. భద్రతాపరమైన పలు కారణాలు చూపుతూ కోయంబత్తూర్ జిల్లా పోలీసులు రోడ్ షో కు అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. 

మార్చి 18 న ప్రధాని మోదీ కోయంబత్తూర్ లో పర్యటన సందర్భంగా కొన్ని షరతులతో నాలుగు కిలోమీటర్లు రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ కోయంబత్తూర్ పోలీసులను ఆదేశించారు.

ప్రధాని రోడ్ షో క్లైమాక్స్ 1998  వరుస పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో ఒకటైన ఆర్ ఎస్ పురంలో జరగాల్సి ఉంది. దీంతోపాటు కోయంబత్తూర్ మతపరంగా సున్నిత ప్రదేశమన్ని , ఏ రాజకీయ పార్టీలు లేదా సమూహాలు రోడ్ షో లకు అనుమతి మంజూరు చేయబడదని తమిళనాడు పోలీసులు హైలైట్ చేశారు. దీంతోపాటు పబ్లిక్ పరీక్షలు మార్చి 18, 19 తేదీల్లో ఉన్నాయని.. రోడ్ షో ఉన్న మార్గంలోనే అనేక పాఠశాలలున్నాయని పోలీసులు అభ్యంతరం తెలిపారు.