పట్టాలు దాటుతున్నబస్సును ఢీ కొట్టిన రైలు..17 మంది మృతి

పట్టాలు దాటుతున్నబస్సును ఢీ కొట్టిన రైలు..17 మంది మృతి
  • 17 మంది మృతి..30 మందికి గాయాలు
  • సెంట్రల్​ థాయ్​లాండ్​లో ఘోర ప్రమాదం

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌: సెంట్రల్‌‌‌‌‌‌‌‌ థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ చాచియాంగ్‌‌‌‌‌‌‌‌సావోలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీ కొట్టడంతో బస్సులోని17 మంది ప్యాసింజర్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ఉన్నట్లు డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకరు మీడియాతో చెప్పారు. సముత్‌‌‌‌‌‌‌‌ ప్రకన్‌‌‌‌‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి చాచోయంగాసోలోని బుద్ధుని గుడికి వెళ్తున్న  టూరిస్ట్ బస్సు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షం కారణంగా బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు రైలు వస్తున్నట్లు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని ఆసుప్రతికి తరలించామని, వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉందని అన్నారు. ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న బస్సును రెస్క్యూ సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో తొలగించారు. కాగా.. థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయని అధికారులు చెప్పారు. రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి. వరల్డ్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌ లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలోనే సెకెండ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది.