అయిజ/ శాంతినగర్ వెలుగు: గద్వాల జిల్లాలో రెండవ విడత ఎన్నికలు జరిగే అయిజ, వడ్డేపల్లి, రాజోలి, మల్దకల్ మండలాల్లో శనివారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. నాలుగు మండలాల్లో 74 గ్రామపంచాయతీలు, 716 వార్డులున్నాయి. అయిజ మండలంలో 28 జీపీల్లో 7, వడ్డేపల్లిలో 10 జీపీల్లో 5, రాజోలిలో 11 జీపీల్లో ఒకటి, మల్దకల్ మండలంలో 25 జీపీలు ఉండగా 5 జీపీలు ఏకగ్రీవమయ్యాయి.
నాలుగు మండలాల్లో 18 జీపీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 56 గ్రామపంచాయతీలకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల్లో వార్డు సభ్యుల సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించి నియామకపత్రాలు అందజేశారు.
పెబ్బేరు: పెబ్బేరు మండలం రామమ్మపేట గ్రామ సర్పంచ్‌గా గుడిసె పద్మమ్మతో పాటు ఆరుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో పద్మమ్మ పోటీ చేయగా, గ్రామస్తులు సైతం సపోర్ట్ చేశారు.
