తెలంగాణలో మరో 18 ఫైర్ స్టేషన్లు.. వర్చువల్‌‌గా ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ

తెలంగాణలో  మరో 18 ఫైర్ స్టేషన్లు.. వర్చువల్‌‌గా ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 18 ఫైర్‌‌ స్టేషన్లను హోం మంత్రి మహమూద్‌‌ అలీ ప్రారంభించారు. ఎల్బీనగర్‌‌, నర్సాపూర్‌‌, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌, జూబ్లీహిల్స్‌‌, చాంద్రాయణ గుట్ట, అంబర్‌‌పేట్‌‌, మల్కాజ్‌‌గిరి, రాజేంద్రనగర్‌‌, షాద్‌‌నగర్‌‌, డోర్నకల్‌‌, కల్వకుర్తి, అలంపూర్‌‌, మక్తల్‌‌, పినపాక, నందిపేట్‌‌, బాల్కొండ, ధర్మపురి, హుస్నాబాద్‌‌ ఫైర్ స్టేషన్లను శుక్రవారం మహమూద్‌‌ అలీ వర్చువల్‌‌గా ప్రారంభించారు.

ఉప్పల్ భగాయత్‌‌లో ఏర్పాటు చేసిన ఎల్బీ నగర్ ఫైర్‌‌ ‌‌స్టేషన్‌‌ ప్రారంభోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వీటితో పాటు 39 క్విక్‌‌ రెస్పాన్స్‌‌ రెస్క్యూ టెండర్‌‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.