గూగుల్ లో రివ్యూల పేరిట రూ.18.79 లక్షలు ఫ్రాడ్

గూగుల్ లో రివ్యూల పేరిట రూ.18.79 లక్షలు ఫ్రాడ్
  • సిటీ ప్రైవేట్‌‌‌‌ ఎంప్లాయ్ ని మోసగించిన సైబర్ చీటర్స్

బషీర్ బాగ్,  వెలుగు : ఇంట్లోనూ ఉంటూ ఆన్ లైన్ లో రివ్యూలు ఇస్తూ.. డబ్బు సంపాదించవచ్చని ఓ వ్యక్తిని సైబర్‌‌‌‌ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన 32 ఏళ్ల ప్రైవేట్‌‌‌‌ ఉద్యోగికి ఇంట్లోనే ఉంటూ పార్ట్‌‌‌‌టైమ్‌‌‌‌ జాబ్‌‌‌‌ చేయొచ్చని కాయిన్‌‌‌‌ డీసీఎక్స్‌‌‌‌ ఎక్స్చేంజ్ డిజిటల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ కంపెనీ పేరుతో వాట్సాప్‌‌‌‌ మెసేజ్‌‌‌‌ వచ్చింది. 

గూగుల్ లో ప్రముఖ హోటల్‌‌‌‌లు, రెస్టారెంట్లకు  రివ్యూలు ఇస్తూ డబ్బు సంపాదించవచ్చని అతనికి ఓ టాస్క్  పంపించారు. దీంతో వారు ఇచ్చిన రివ్యూల 5 టాస్క్‌‌‌‌లను పూర్తి చేశాడు. డబ్బులు వచ్చాయని, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితుడి నుంచి రూ.18.79 లక్షలు కాజేశారు.

మరింత డబ్బు పెట్టుబడిగా పెడితే 30 నుంచి 40 శాతం కమీషన్‌‌‌‌ ఇస్తామని మరోసారి నమ్మించారు. అనుమానం వచ్చిన బాధితుడు డబ్బు విత్‌‌‌‌ డ్రాకు ప్రయత్నించగా కాలేదు. మోసపోయానని బాధితుడు సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు.