ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీలో 1920.. మూవీ షూటింగ్ స్టార్ట్

ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీలో 1920.. మూవీ షూటింగ్ స్టార్ట్

1940లో ఒక గ్రామం,  కమలతో నా ప్రయాణం  వంటి అవార్డు చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా  చిత్రం  ‘1920 భీమునిపట్నం’.  భారత స్వాతంత్రోద్యమం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కంచర్ల ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు.  కంచర్ల అచ్యుతరావు నిర్మాత. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్  హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో  ప్రారంభమైంది. 

అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో  కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణా దేవి కనిపిస్తుంది. వీరిద్దరిపై తీసిన ముహూర్తపు తొలి సన్నివేశానికి చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ కొట్టారు.