
191 దేశాలకు వెళ్లొచ్చు
హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ వెల్లడి
ఇండియాకు 84వ ప్లేస్..58 దేశాలకే వెళ్లే చాన్స్
లిస్టులో ఆఫ్ఘనిస్థాన్,ఇరాక్, సిరియా లాస్ట్
ప్రపంచంలో ఏ దేశ పాస్‌పోర్టు ట్రావెలర్లకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తోంది? ఏ దేశ పాస్‌పోర్టు మస్తు పవర్‌ఫుల్? ఏ దేశ పాస్‌పోర్టుతో ఎక్కువ దేశాలను వీసా లేకుండా చుట్టి రావొచ్చు? వీటన్నింటికీ జవాబొక్కటే. జపాన్. ఈ ఒక్క కంట్రీ పాస్‌పోర్టుంటే చాలు 191 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఇలా ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల వివరాలను హెన్రీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ వెల్లడించింది. 2020కి గాను హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ పేరుతో విడుదల చేసింది. ఈ ఏడాది రిలీజ్ చేసిన ఫస్ట్ ఇండెక్స్ ఇదే. ఈ సూచీలో మన దేశం 84వ స్థానంలో నిలిచింది. గతేడాది కన్నా రెండు ర్యాంకులు దిగజారింది. 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్ దేశాలతో ర్యాంకును పంచుకుంది. ఇండియా పాస్‌పోర్టుతో ముందస్తు వీసా లేకుండా 58 దేశాలకు వెళ్లొచ్చు.
టాప్ 10లో ఈయూ దేశాలు
ఇండెక్స్‌లో జపాన్ తర్వాత రెండో స్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశం పాస్‌పోర్టుతో 190 దేశాలకు పోయి రావొచ్చు. మూడో స్థానంలో సౌత్ కొరియా, జర్మనీ దేశాలున్నాయి. వీటి పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లొచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో యూరోపియన్ దేశాలున్నాయి. ఫిన్‌లాండ్, ఇటలీ నాలుగో స్థానంలో ఉన్నాయి. వీటి పాస్‌పోర్టుతో 188 దేశాలు చుట్టి రావొచ్చు. ఐదో ప్లేస్‌లో ఉన్న స్పెయిన్, లగ్జెంబర్గ్, డెన్మార్క్ పాస్‌పోర్టులతో 187 దేశాలకు పోయి రావొచ్చు.
అమెరికా, బ్రిటన్ వెనక్కి
పాస్‌పోర్టు సూచీలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్ మాత్రం వెనకబడుతున్నాయి. 2015లో రెండు దేశాలు కలిసి టాప్ ప్లేస్‌లో నిలవగా ఈసారి మాత్రం రెండూ 8వ స్థానికి దిగజారాయి. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్‌కు బాగా నష్టం జరిగింది. ఏడో స్థానంలో ఉన్న ఐర్లాండ్ ఒక్క 2019లోనే 9 లక్షల పాస్‌పోర్టులను మంజూరు చేసింది. వీళ్లలో ఎక్కువ మంది బ్రిటిష్ పౌరులే ఉన్నారు. ఇండెక్స్‌లో యూఏఈ పైపైకి వస్తోంది. పదేళ్లలో 47 స్థానాలు మెరుగుపరుచుకుని 18వ ప్లేస్‌లో ఉంది. 171 దేశాలకు వెళ్లి రావొచ్చు.
పాక్‌కు లాస్టు నుంచి నాలుగో ప్లేస్
ఇక లిస్టులో ఆఫ్ఘనిస్థాన్ లాస్టుంది. 107వ ప్లేస్‌లో నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్టుతో కేవలం 26 దేశాలకే వెళ్లొచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్ (28), సిరియా (29), సోమాలియా, పాకిస్థాన్ (32), యెమెన్ (33), లిబియా (37), నేపాల్, పాలస్తీనా ప్రాంతం (38), ఉత్తర కొరియా, సుడాన్ (39) ఉన్నాయి.
ప్రపంచంలో టాప్ 5 పవర్‌ఫుల్ పాస్‌పోర్టులు
1. జపాన్ (191 దేశాలకు
వీసా లేకుండా వెళ్లొచ్చు)
2. సింగపూర్ (190)
3. దక్షిణ కొరియా, జర్మనీ (189)
4. ఇటలీ, ఫిన్లాండ్ (188)
5. స్పెయిన్, లగ్జెంబర్గ్, డెన్మార్క్ (187)